తొలి రోజే అల్లు అర్జున్ కారావ్యాన్ తో వచ్చిన అర్హ..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు గుణశేఖర్ యొక్క శకుతలంతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమైన విషయం తెలిసిందే. అభిమానులు ఆమెను బిగ్ స్క్రీన్ పై చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవల ఆమె సెట్స్‌లోకి అడుగు పెట్టడంతో చిత్ర యూనిట్ సభ్యులు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు.


గత కొన్ని రోజులుగా వర్క్ షాప్ లో పాల్గొన్న అర్హ గుణశేఖర్ కు చాలా క్లోజ్ అయ్యిందట. సినిమా యూనిట్ సబ్యులతో కూడా మంచి సాన్నిహిత్యం ఏర్పడడంతో ఇక వీలైనంత త్వరగా షూటింగ్ స్టార్ట్ చేయాలని ఫైనల్ గా ఒక షెడ్యూల్ ను సెట్ చేశారు. ఇక మొదటి షెడ్యూల్ కోసం సెట్స్ కు వచ్చిన అర్హ తొలి రోజే నాన్న అల్లు అర్జున్ ఖరీదైన కారావ్యాన్ వేసుకొని వచ్చేసింది. శాకుంతలం యూనిట్ కూడా అర్హకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పి తొలిరోజు మేకప్ వేశారు. మరి అర్హ వెండితెరపై ఎలా నటిస్తుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post