గతంలో, నటుడు అర్జున్ సర్జా మహేష్ బాబు రాబోయే చిత్రం సర్కారు వారి పాటలో ఒక కీలక పాత్రలో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు టాక్ అయితే వచ్చింది. అతను చేసేది పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ అని కూడా టాక్ అయితే వచ్చింది. ఇక దర్శకుడు పరశురామ్ మళ్ళీ తన ఆలోచనను మార్చుకొని ఆ పాత్ర కోసం సీనియర్ నటుడు జగపతిబాబును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
జగపతిబాబు కేవలం సపోర్టింగ్ రోల్స్ మాత్రమే కాకుండా విలన్ పాత్రలతో కూడా అదరగొడుతున్నాడు. SVP మాత్రమే కాకుండా జగపతి బాబు ప్రస్తుతం టక్ జగదీష్, రిపబ్లిక్, గుడ్ లక్ సఖి, గని, పుష్ప, మహా సముద్రం వంటి విభిన్నమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సముద్రకని విలన్ గ నటిస్తున్న ఈ చిత్రం 2022 జనవరి 13న విడుదల కానుంది.
Follow @TBO_Updates
0 Comments