బిగ్ బాస్ 5 తెలుగు.. కంటెస్టెంట్స్ వీరేనా?


బిగ్ బాస్ 5 ఇటీవలి కాలంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న షోలలో ఒకటి.  ఐదవ సీజన్ త్వరలో ప్రారంభమవుతుందని ఇటీవల మేకర్స్ లోగో టీజర్ తోనే అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. ఇక హోస్ట్ గా ఉండేదేవరు కంటెస్టెంట్స్ గా హౌజ్ లోకి వచ్చేదేవరు అనే విషయాలు ఎంతో ఆసక్తిగా మారుతున్నాయి.

ఎక్కువగా యూట్యూబ్ స్టార్స్ పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో సెన్సేషన్ షణ్ముఖ్ జస్వంత్, కమెడియన్ లోబో, ఆర్జే కాజల్, యాంకర్ నిఖిల్, యాంకర్ రవి, సురేఖ వాణి, ప్రియా రామన్, ఇషా చావ్లా, యు ట్యూబర్ సిరి హముమంత్ వంటి వారు ఈ షోలో ఉంటారని టాక్ వస్తోంది. ఈ పేర్లు ఇంకా ఫైనల్ కాలేదు గాని ఫిల్మ్ సర్కిల్స్ లో మాత్రం ఇందులో సగం మంది ఫిక్స్ అని అంటున్నారు.  ఇక హోస్ట్ గా రానా దగ్గుబాటి పేరు వినిపించినప్పటికీ మళ్ళీ నాగార్జున ద్వారానే కొనసాగనున్నట్లు మరో బలమైన టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయంపై కూడా అఫీషియల్ గా వివరణ ఇవ్వనున్నారు.


Post a Comment

Previous Post Next Post