శేఖర్ కమ్ముల - ధనుష్.. అసలు పాయింట్ ఇదే!


శేఖర్ కమ్ముల - ధనుష్ కాంబినేషన్ ఎనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఆ ప్రాజెక్ట్ పై రోజుకో వార్త కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తోంది. ఒకసారి లీడర్ సీక్వెల్ అని కూడా టాక్ వచ్చింది. ఇక ప్రస్తుతం అయితే మరొక టాక్ బలంగా వినిపిస్తోంది. సినిమా పూర్తిగా 1950 బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కుతుందట. 

మద్రాసి తెలుగు లీడర్ గా ధనుష్ కనిపిస్తాడని కొత్త తరహా వార్త ఒకటి హాట్ టాపిక్ గా మారింది. అప్పట్లో ఆంద్రప్రదేశ్ - తమిళనాడుకు ఉమ్మడి రాజధానిగా ఉన్న మద్రాస్ చుట్టూనే కథ తిరుగుతుందట. శేఖర్ కమ్ముల తన కెరీర్ లో ఎప్పుడు కూడా ఇలాంటి పిరియడ్ డ్రామా జానర్ ను టచ్ చేసింది లేదు. మరి మొదటిసారి ఇలాంటి సెన్సిటివ్ కథను ట్రిలాంగ్యువల్ కథగా ఎలా తెరకెక్కిస్తారో చూడాలి. ప్రస్తుతం ధనుష్ రెండు సినిమాలను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక అప్పటిలోపు ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకోనున్న శేఖర్ కమ్ముల ఈ ఏడాది చివరలో రెగ్యులర్ షూట్ ను స్టార్ట్ చేసే అవకాశం ఉందట.


Post a Comment

Previous Post Next Post