నాగచైతన్య.. సింపుల్ బాలీవుడ్ ప్లాన్స్?


టాలీవుడ్ లో చాలామంది యువ హీరోలు మిగతా భాషల్లో కూడా పట్టు సాధించాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. కుదిరితే పాన్ ఇండియా లేదంటే సౌత్ బైలాంగ్యువల్ అంటూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక నాగచైతన్య అయితే డైరెక్ట్ గా బాలీవుడ్ సినిమాలతోనే బిజీ అవ్వాలని ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం హిందీలో అమీర్ ఖాన్ తో లాల్ సింగ్ చద్దా అనే సినిమా చేస్తున్న నాగ చైతన్య బాలీవుడ్ లో తన PR టీమ్ ద్వారా బాగానే ప్రమోట్ చేసుకుంటున్నాడట. అంతే కాకుండా అతనికి మరికొన్ని పెద్ద సినిమాల్లో కూడా సపోర్టింగ్ రోల్స్ చేసే ఛాన్స్ లు వస్తున్నాయట. అయితే నాగచైతన్య తొందర పడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఎలాగైనా బాలీవుడ్ లో లీడ్ రోల్స్ చేయాలని టార్గెట్ సెట్ చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూద్దాం.


Post a Comment

Previous Post Next Post