అసలు ఈ టైగర్ నాగేశ్వరరావు ఎవరు..?? - TollywoodBoxoffice.in

Exclusive Portal for Boxoffice Collections

అసలు ఈ టైగర్ నాగేశ్వరరావు ఎవరు..??


ఆంధ్రప్రదేశ్లోని స్టువర్ట్పురం గ్రామం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ప్రస్తుతం అక్కడ గతంలో మాదిరిగా అయితే పరిస్థితులు లేవు. అయితే ఒకప్పుడు దొంగల బెడద చాలా ఎక్కువ.  బ్రిటిష్ కాలం లోనే ఆ గ్రామానికి ఆ పేరు వచ్చింది. పరిసరాల ప్రాంతాల్లో ఎక్కడ దొంగతనం జరిగినా కూడా పోలీసులు స్టువర్ట్ పురం కి వచ్చే ప్రతి ఒక్కరిని ఆరా తీసేవారు. ఇక అలాంటి గ్రామంలోనే టైగర్ నాగేశ్వరరావు పేరు అప్పట్లో కలకలం సృష్టించింది.

1970, 80ల కాలంలో టైగర్ నాగేశ్వరరావు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. టైగర్ నాగేశ్వరరావు ఫోకస్ పడింది అంటే ఆ రోజు దొంగతనం జరగాల్సిందే. అతనిలో ఉన్న మరో మంచి లక్షణం ఏమిటంటే ఉన్నవాడి నుంచి దోచుకుని లేని వాడికి కూడా వీలైనంత వరకు సాయం చేసేవాడు. ఇక చివరికి పోలీసుల చేతిలోనే ఏన్ కౌంటర్ చేయబడ్డాడు. ఇక అలాంటి గజదొంగకి సంబంధించిన బయోపిక్ పై చాలా రోజులుగా ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. ఫైనల్ గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా చేయడానికి అంగీకరించాడు వివి. వినాయక్ శిష్యుడు KS దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. స్టువర్ట్ పురం దొంగ అనే టైటిల్ తో పోస్టర్ ను కూడా విడుదల చేసి త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు ప్రకటించారు.