దగ్గుబాటి మల్టీస్టారర్.. సినిమా కాదు!


టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ ప్రాజెక్టుల సంఖ్య మెల్లగా పెరుగుతోంది. ఒకే కుటుంబానికి చెందిన హీరోలు కూడా సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దగ్గుపాటి ఫ్యామిలీ లో గత ఏడాది నుంచి అనేక రకాల వార్తలు వస్తున్నాయి. నాగచైతన్య వెంకటేష్ తో సురేష్ బాబు ఇదివరకే వెంకి మామ సినిమాలు నిర్మించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వెంటనే రానా దగ్గుబాటి వెంకటేష్ తో కూడా మరో సినిమా చేయాలని అనుకున్నారు

మంచి కాన్సెప్ట్ దొరికినప్పటికి ఇంకా నమ్మకంగా అనిపించడం లేదట. అయితే ఇటీవల ఒక వెబ్ సిరీస్ చేయడానికి వెంకటేష్ రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వస్తోంది ఇది వరకే ఆ విషయంపై ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. నెట్ ఫ్లిక్స్ లో సురేష్ బాబు ఇప్పటికే ఒక డీల్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత త్వరలోనే ఆ వెబ్ సిరీస్ గా పట్టాలెక్క అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందరికంటే ముందు ప్రాజెక్ట్ సెట్టయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి వెబ్ సిరీస్ చేసిన స్టార్ హీరోలుగా వెంకటేష్ రానా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయం.


Post a Comment

Previous Post Next Post