కష్టాల్లో ఉన్న దర్శకుడి కోసం నిర్మాతగా మారిన సూర్య!


తమిళ హీరో సూర్య సినిమా అంటే కేవలం ఒక వ్యాపారం గానే కాకుండా ఎంతో బాధ్యతాయుతంగా ఉండాలని ఆలోచిస్తాడు. ఇక ఎంతగానో ప్రేమించే అభిమానులకు కూడా వీలైనంత వరకు సహాయం చేయడానికి ముందుకు వస్తాడు  అలాంటిది తనకు లైఫ్ ఇచ్చిన వారిని కూడా ఏమాత్రం వదిలిపెట్టడు. సూర్య కెరీర్ మరో స్థాయికి చేరుకోవడానికి దర్శకుడు బాల ఎంతగానో ఉపయోగపడ్డాడు.

శివ పుత్రుడు సినిమాలో మెయిన్ హీరోగా విక్రమ్ నటించినప్పటికీ, సూర్య పాత్ర లేకపోతే సినిమా అంతగా క్లిక్ అయ్యేది కాదు. సూర్యకు నటుడిగా మంచి పేరు వచ్చింది ఆ సినిమాతోనే. అందుకు దర్శకుడు బాలా అతనికి ఎంతగానో హెల్ప్ చేశాడు. అయితే ప్రస్తుతం బాల పరిస్థితి ఏ మాత్రం  బాలేదు. ఆ మధ్య అర్జున్ రెడ్డిని తమిళ్ రీమిక్ చేసినా కూడా సినిమా విడుదల కాకుండానే మరుగున పడిపోయింది. ఇక ఇప్పుడు అతనికి సూర్య న్యూ లైఫ్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. కీర్తి సురేష్ అధర్వ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమాకు బాలా దర్శకత్వం వహిస్తుండగా సూర్య నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఆ సినిమా కథను ఎవరు నిర్మించడానికి ముందుకు రాకపోవడంతో సూర్య తన సొంత ప్రొడక్షన్ 2D ఎంటర్టైన్మెంట్స్ లో నిర్మించేందుకు సిద్ధమయ్యాడు. సూర్య చేసిన సహాయం వల్ల దర్శకుడు బాల ఎంత వరకు సక్సెస్ అవుతాడో చూడాలి.


Post a Comment

Previous Post Next Post