NTR30: అనిరుధ్ రెమ్యునరేషన్ లో అస్సలు తగ్గట్లేదుగా!


జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రానున్న పాన్ ఇండియా సినిమా ఎలా ఉంటుందో కానీ ప్రీ ప్రొడక్షన్ దశలోనే చిత్రయూనిట్ భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా దర్శకుడు కొరటాల శివ మొదటిసారి ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. గతంలో వీరి కలయికలో వచ్చిన జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ మంచి వసూళ్లను అందుకుంది. 

ఇక ఇప్పుడు అంతకుమించి అనేలా రెడీ అవుతున్నారు. సినిమాలో మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి సందేశం కూడా ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా అనీరుధ్ ని ఫిక్స్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే అనిరుధ్ ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలను టచ్ చేయలేదు. దీంతో అతను కూడా దాదాపు 4.50కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకోవచ్చని సమాచారం. మరి ఈ కాంబినేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post