ఒకేసారి ఎగబడిన జనాలు.. షాకైనా కాజల్ భర్త!


టాలీవుడ్ ఇండస్ట్రీలో చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న కాజల్ అగర్వాల్ చాలా రోజుల తరువాత తెలుగు గడ్డపై దర్శనమిచ్చింది. తన భర్తతో కలిసి ఇటీవల వరంగల్ లో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వచ్చింది.  గౌతమ్ కిచ్లుని అభిమానులకు పరిచయం చేస్తూ తన నవ్వుతో మంత్రముగ్దులను చేసింది.

ఇక కాజల్ ను చూసేందుకు చుట్టుపక్కల ఊర్ల నుంచి చాలామంది జనాలు అక్కడికి చేరుకున్నారు. ఇక కాజల్ క్రేజ్ ను చూసి ఒక విధంగా గౌతమ్ షాక్ కు గురయ్యాడట. ఆ స్థాయిలో జనాలను ఒకేసారి ఎప్పుడు చూడలేదని కూడా అన్నాడు. ఇక కాజల్ అగర్వాల్ సినిమాల విషయానికి వస్తే ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించింది. అలాగే ప్రవీణ్ సత్తారు - నాగార్జున సినిమాతో పాటు మరో రెండు సినిమాలను ఫినిష్ చేయనుంది.


Post a Comment

Previous Post Next Post