ఆ నలుగురికి మెగాస్టార్ స్వీట్ వార్నింగ్ ... ?


ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో కరోనా కారణంగా పలు సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో సినిమా థియేటర్స్ పూర్తిగా తెరుచుకోకపోవడంతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించి అలానే పలు ఇతర సమస్యలతో సతమతం అవుతుండడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని కలిసి ఇటువంటి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించాలని నిర్ణయించారు. అందుకుగాను ఇప్పటికే మంత్రి పేర్ని నాని ని కలిసి పలువురు సినిమా పరిశ్రమ ప్రముఖులు, నిన్న మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. 

అయితే ఆ సమయంలో ముఖ్యంగా చర్చకు వచ్చిన ప్రధాన సమస్యల్లో డిస్ట్రిబ్యూటర్ల నుండి నిర్మాతలు వసూలు చేస్తున్న వర్చువల్ ప్రింట్ ఫీజు ని పూర్తిగా రద్దు చేసి, దానిని థియేటర్స్ ఒనర్స్ నుండి వసూలు చేసేలా టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలైన సురేష్ బాబు, సునీల్ నారంగ్, దిల్ రాజు, అల్లు అరవింద్ లకు మెగాస్టార్ చిరంజీవి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే పలువురు డిస్ట్రిబ్యూటర్లు సమస్యలతో సతమతం అవుతున్నారని, అయితే ఇటువంటి సమయంలో ఈ ఫీజ్ వసూలు తో వారు మరింత ఇబ్బందులు ఎదుర్కొనడం ఇష్టం లేకనే చిరంజీవి ఇండస్ట్రీ నిర్మాతలకు ఈ హుకుం జరీ చేసినట్లు చెప్తున్నారు. 

అయితే చిరు చేసిన సూచన తో ఆయన బావమరిది అల్లు అరవింద్, అలానే దిల్ రాజు ఒప్పుకోగా, సురేష్ బాబు, సునీల్ నారంగ్ ఒక వారం పాటు సమయం అడిగినట్లు చెప్తున్నారు. కాగా ఈ విధంగా ఇండస్ట్రీ సమస్యలను తన భుజాన వేసుకుని పరిష్కరించేందుకు సహృదయంతో ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి!

Post a Comment

Previous Post Next Post