డ్రగ్స్ దందా పై ఓపెన్ అయిన సంజన!


ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటి సంజన ఆపై కొన్నాళ్లుగా జైలు లో గడిపి కొద్దిరోజుల క్రితం కండీషనల్ బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే ఆమెతో పాటు జైలు కి వెళ్లిన రాగిణి ద్వివేది కి కూడా బెయిల్ దక్కింది. ఇక కొద్దిరోజుల క్రితం ఫోరెన్సిక్ వారు ఇద్దరి నుండి హెయిర్ శాంపిల్స్ తీసుకుని పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చినట్లు సమాచారం. అయితే ఈ విషయమై నేడు ఒక ప్రముఖ జాతీయ పత్రిక వారితో సంజనా మాట్లాడుతూ తామిద్దరినీ మాత్రమే దోషులుగా చూపుతున్నారని, పలువురు పెద్ద సెలెబ్రిటీలు  రాజకీయ నాయకులు దీని నుండి తెలివిగా తప్పించుకున్నారని అన్నారు. 

తన అరెస్ట్ తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, నా అనుకున్న వాళ్ళందరూ తనని దూరం పెట్టారని, ఆర్ధికంగా కొన్నాళ్లుగా ఇబ్బందులు పడుతున్న తనకు ఇటీవల మళ్ళి అవకాశాలు దక్కడం కొంత ఊరట కలిగించే విషయం అన్నారు. అయితే తనకంటే మరింత ఇబ్బందుల్లో ఉన్నవారికి ఇకపై సాయం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు సంజనా. ఈ కేసులో మాత్రం లీగల్ గా లాయర్ ద్వారా గట్టిగా పోరాడుతున్నాని, దేవుడు తన పక్షాన ఉన్నాడని, తప్పకుండా తనకు మంచి జరుగుతుందని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.


Post a Comment

Previous Post Next Post