Buzz: థమన్ ను రిజెక్ట్ చేస్తున్న బన్నీ?


బన్నీ పుష్ప 1 ని ముగించిన తర్వాత ఐకాన్ సినిమాను స్టార్ట్ చేయనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దర్శకుడు వేణు శ్రీరామ్ ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ ప్లాన్ సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించకపోవచ్చని తెలుస్తోంది.

వకీల్ సాబ్ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వడంతో దర్శకుడు వేణు శ్రీరామ్ తన తదుపరి సినిమాకు కూడా అతన్నే సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నాడు. అందుకు దిల్ రాజు కూడా ఒప్పుకున్నాడు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఆ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఐకాన్ ను కూడా పాన్ ఇండియా లెవెల్లోకి తీసుకురావాలని అందుకే సినిమాకు బాలీవుడ్ కంపోజర్ ను ఫిక్స్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. హీరో ఫిక్స్ అయితే ఆల్ మోస్ట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా ఆలోచనను మార్చుకోవాల్సిందే. మరి బాలీవుడ్ లో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారో చూడాలి.


Post a Comment

Previous Post Next Post