షూటింగ్ లో గాయపడిన ప్రకాష్ రాజ్!


ప్రముఖ నటుడు, ప్రకాష్ రాజ్ చెన్నైలో ధనుష్ చిత్రం షూటింగ్ సమయంలో కిందపడిపోవడంతో గాయలపాలైనట్లు తెలుస్తోంది. వెంటనే ప్రకాష్ రాజ్‌ను చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేయాలని సూచించారు. దీంతో ప్రకాష్ తన శస్త్రచికిత్స  చేయించుకోవడానికి హైదరాబాద్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కొన్ని రోజులు తప్పనిసరిగా రెస్ట్ కావాలని డాక్టర్స్ వివరణ ఇవ్వడంతో షూటింగ్స్ ను వాయిదా వేసుకున్నారు. ఇక ఇటీవల కాలంలో ప్రకాష్ రాజ్ ఎక్కువగా కాంట్రవర్సీ వార్తల్లోనే వైరల్ అవుతున్నారు. అలాగే అతను త్వరలో మా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ప్రకాష్ రాజ్ కు గాయాలయ్యాయి అనగానే ప్రముఖ సినీ తారలు ఆయనకు ప్రత్యేకంగా  ఫోన్ చేసి బాగోగుల గురించి అడిగి తెలుసుకుంటున్నారు.


Post a Comment

Previous Post Next Post