మొదటిసారి నెగిటివ్ పాత్రలో సింగర్ మంగ్లీ!


ఇటీవల కాలంలో సింగర్స్ కూడా వెండితెరపై సరికొత్తగా కనిపిస్తున్నారు. మొదట యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన మంగ్లీ అనంతరం సింగర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. రాములో రాముల అంటూ ఎన్నోరకాల.మాస్ పాటలతో తన స్థాయిని పెంచుకుండి. ఇక నెక్స్ట్ సినిమాల్లో నటిగా కూడా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. 

నితిన్ హీరోగా నటిస్తున్న అందాదున్ రీమేక్ మాస్ట్రో త్వరలో హాట్ స్టార్ లో విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే సినిమాలో మంగ్లీ ఒక నెగిటివ్ పాత్రలో నటిస్తోంది. హీరోను కిడ్నాప్ చేసి అతని అవయవాలను సైతం దొంగిలించాలని అనుకునే ఒక ఊర మాస్ ఫ్రాడ్ పాత్రలో కనిపించనుంది. మరి మొదటిసారి సినిమాలో నటిస్తున్న ఈ స్టార్ సింగర్ ఎంతవరకు విజయాన్ని అందుకుంటారో చూడాలి.


Post a Comment

Previous Post Next Post