Megastar in another Tamil movie Remake!


ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య అనే యాక్షన్, కమర్షియల్ మూవీ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. చరణ్ ఇందులో సిద్ద అనే పాత్ర చేస్తుండగా కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తో పాటు ఇటీవల తన నెక్స్ట్ సినిమా గాడ్ ఫాదర్ కూడా మొదలెట్టారు చిరు. మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ రెండు సినిమాల అనంతరం మెహర్ రమేష్ తో వేదాళం రీమేక్ గా భోళా శంకర్, అలానే బాబీ తో మరొక సినిమా కూడా చేయనున్నారు మెగాస్టార్.

ఇక ఇటీవల అధికారికంగా వెల్లడైన ఈ మూవీస్ తరువాత మరొక తమిళ్ రీమేక్ ని మెగాస్టార్ చేయనున్నారు అనే వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం కొన్నేళ్ల క్రితం అజిత్ తో గౌతమ్ మీనన్ తీసిన సూపర్ హిట్ మూవీ ఎన్నై అరిందాల్ తెలుగు హక్కులు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ కొనుగోలు చేసిందని, త్వరలో మెగాస్టార్ హీరోగా సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా కథని 
మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా తీసే దర్శకుడి కోసం ప్రస్తుతం వెతుకుతున్నారట. అలానే త్వరలో ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీలో మెగాస్టార్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారట.

Post a Comment

Previous Post Next Post