భాగ్యనగరంలో దర్శనమిచ్చిన RRR బ్యూటీ!


ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఎన్టీఆర్ కొమురం భీం గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలుగా యాక్ట్ చేస్తున్నారు. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబందించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా నటిస్తున్న హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ షూటింగ్ మొత్తం పూర్తి కావడంతోప్ ప్రస్తుతం తన ఫ్రెండ్స్ తో కలిసి హైదరాబాద్ లో షికార్లు చేస్తూ పలు ప్లేసెస్ ని చుట్టేస్తోంది. అందులో భాగంగా నేడు శిల్పారామం వెళ్లిన ఒలీవియా అక్కడ దిగిన ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది. అవి ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతుండగా, ఆర్ఆర్ఆర్ సినిమా తప్పకుండా తన కెరీర్ కి పెద్ద బ్రేక్ ని ఇవ్వడం ఖాయం అని అంటోంది ఒలీవియా.


Post a Comment

Previous Post Next Post