మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ట్విస్టులు.. ఒక్క రాత్రికే ప్లాన్ చేంజ్!


ఊహించని ట్విస్ట్‌లో, సీనియర్ నటీమణులు జీవిత రాజశేఖర్ మరియు హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికల్లో తమ పోటీని ఉపసంహరించుకున్నారు.  జీవిత మరియు హేమ ఇద్దరూ ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లో చేరడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. వీరు జనరల్ సెక్రటరీ మరియు వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తారట. నిన్న మీడియా ఇంటరాక్షన్‌లో, ప్రకాష్ రాజ్ ఆ విషయాన్ని అధికారికంగా వివరణ ఇచ్చారు.

ఇటీవల జీవిత మరియు హేమలను కలిశానని, అసోసియేషన్ సంక్షేమం కోసం కలిసి పనిచేయడానికి వారిని ఒప్పించానని వెల్లడించాడు. రాబోయే ఎన్నికలకు ముందు సీనియర్ నటీమణులు ఇద్దరూ తన ఎజెండాతో ఆకట్టుకున్నారని ఆయన వెల్లడించారు. ఇక MAA ప్రెసిడెంట్ రేసులో జీవిత మరియు హేమ లేనందున, ప్రధాన పోటీ ఇప్పుడు ప్రకాష్ రాజ్ మరియు మంచు విష్ణు మధ్యలో చోటు చేసుకోనుంది. అలాగే సీనియర్  నరేష్ కూడా అందులో కీలక పాత్ర పోషించనున్నారు.  MAA ఎన్నికలు అక్టోబర్ 10న జరగనున్నాయి.


Post a Comment

Previous Post Next Post