పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన హ్యాపీడేస్ కృష్ణుడు!


మియాపూర్‌లోని ఓ విల్లాపై ఎస్వోటీ పోలీసుల చేసిన ఆకస్మిక దాడుల్లో పేకాట ఆడుతూ పలువురు ప్రముఖులు పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. ఇక అందులో టాలీవుడ్ ప్రముఖ నటుడు కృష్ణుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పోకిరి, హ్యాపీడేస్, వాన, యువత వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించిన కృష్ణుడు ఆ తరువాత వినాయకుడు సినిమాలో హీరోగా నటించాడు.

ఇక ఇటీవల పేకాట ఆడుతూ పోలీసులుకు దొరికినట్లు తెలుస్తోంది. అతడితో పాటు మరో 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పేకాటలో గొడవ కారణంగానే ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం వలన అందరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు సమాచారం. ఇక గతంలో కృష్ణుడు వైఎస్సార్ సిపిలో కూడా పొలిటికల్ గా కొనసాగిన విషయం తెలిసిందే. పాదయాత్రలో కూడా అతను పాల్గొన్నారు.


Post a Comment

Previous Post Next Post