ప్రభాస్ దిల్ రాజు 'వ్రిందావన'.. అసలు కథేంటి?


రెబల్ స్టార్ ప్రభాస్  వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీ అవుతున్న విషయం తెలిసిందే. అయితే మధ్యమధ్యలో కొన్ని చిన్న సినిమాలు కూడా చేయాలని అనుకుంటున్నారు కానీ పెరిగిన మార్కెట్ వలన అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకోవాలని పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇక నిర్మాతలు దర్శకులు కూడా ఎక్కువగా అలాంటి కథలతోనే వస్తున్నారు కూడా. అయితే దిల్ రాజు ఒక కమిట్మెంట్ తీసుకోవడం వలన ప్రభాస్ తగ్గట్లుగానే సినిమాను ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక ఇటీవల దిల్ రాజు ప్రభాస్ కోసం వ్రిందావన అనే టైటిల్ ను రిజిస్ట్రేషన్ చేయించినట్లు గా టాక్ అయితే వస్తోంది. ఆ సినిమా పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇక సినిమాను 2023 చివర్లో మొదలు పెట్టె అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టైటిల్ వివరాల్లోకి వెళితే.. వ్రిందావన అనేది ఉత్తర ప్రదేశ్, మథుర జిల్లాలోని ఒక పట్టణం. ఇది కృష్ణ భగవానుడు తన చిన్ననాటి రోజులను గడిపిన ప్రదేశములలో ఒకటి అని చెబుతారు. ఈ పట్టణం కృష్ణ భగవానుని జన్మ స్థలమైన మథుర నుండి 15 కి.మీ. దూరంలో ఉంటుంది. మరి అలాంటి బ్యాక్ డ్రాప్ లో సినిమాను ఏదైనా ప్లాన్ చేస్తున్నారో లేదో చూడాలి.


Post a Comment

Previous Post Next Post