మరొక గీతగోవిందం లాంటి సినిమా?


రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఇద్దరు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సుకుమార్ తోపాటు మజిలీ డైరెక్టర్ శివ నిర్వణతో కూడా సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.

ఇక సుకుమార్ సినిమా ఎలా ఉంటుందో కానీ శివ మాత్రం ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ సినిమా పై ఒక క్లారిటీ ఇచ్చేశాడు. ఆ సినిమా తెలుగు ఫ్లేవర్ లో నాన్ స్టాప్ ఎంటర్టైనర్ గా ఉంటుందట. విజయ్ దేవరకొండ లైగర్ అనంతరం పాన్ ఇండియా సినిమా చేస్తాడో లేదో తెలియదు కానీ శివతో పక్కా మాత్రం టాలీవుడ్ మూవీ గానే తెరకెక్కుతుందట. అంటే మరో గీత గోవిందం సినిమా వస్తుందని చెప్పవచ్చు. ఒక వేళ విజయ్ దేవరకొండ మనసు మార్చుకుంటే కూడా తన దగ్గర ఉన్న కథలలో ఏదైనా ఒక కథను పాన్ ఇండియా కథ మార్చే అవకాశం కూడా ఉంటుందని శివ నిర్వణ వివరణ ఇచ్చాడు.


Post a Comment

Previous Post Next Post