పవర్ స్టార్ డైలాగ్ చెప్పిన వీరేంద్ర సెహ్వాగ్ !


ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఎంతో మంది సినీ తారలు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలను అందించారు. ఇక మరికొందరు పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ని కూడా ఇమిటెంట్ చేస్తూ విష్ చేశారు. ఇక మొదటిసారి మాజీ సూపర్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా పవన్ కళ్యాణ్ డైలాగ్ ను తనదైన శైలిలో చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


గబ్బర్ సింగ్ సినిమాలోని అందరికీ నచ్చిన డైలాగు అయినటువంటి.. నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది అనే డైలాగ్ ను వీరేంద్ర సెహ్వాగ్ పవన్ కళ్యాణ్ స్టైల్ లోనే చెప్పడం విశేషం. ఒక అభిమాని వీరేంద్ర సేవాగ్ తో ఎంతో ఇష్టంగా ఈ డైలాగ్ ను చెప్పించినట్లు అర్థమవుతోంది. మరోసారి పవన్ కళ్యాణ్ పేరు సెహ్వాగ్ తో పాటు నేషనల్ వైడ్ గా వైరల్ అవుతోంది. ఇక ప్రస్తుత పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.


Post a Comment

Previous Post Next Post