టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేటు ఎక్కువగా ఉండే నిర్మాతలలో దిల్ రాజు ఒకరని అందరికి తెలిసిందే. ఈలంటి సినిమా చేసినా కూడా మినిమమ్ టేబుల్ ప్రాఫిట్ వచ్చేలా జాగ్రత్తలు తీసుకునే దిల్ రాజు మొదటి సారి వరుసగా మూడు పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతున్నారు. దీంతో ఆయన ఆ రూట్లో ఎలాంటి విజయాలను అందుకుంటారు అనేది హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఒక పొలిటికల్ బ్యాగ్రౌండ్ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 8న లాంచ్ కానుంది. మరోవైపు విజయ్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో కూడా ఒక సినిమాకు ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ తో చేయబోయే ఐకాన్ సినిమాను కూడా పాన్ ఇండియా మార్కెట్లోకి దింపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమాలు బాక్సాఫీసు వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటాయో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment