వెంకీ మామ కు మరో ఓటీటీ గండం!


వెంకీ మామ సినిమా అనంతరం విక్టరీ వెంకటేష్ సినిమాల ఎంపిక విషయంలో కాస్త విబిన్నంగా అడుగులు వేస్తున్నారు. వరుసగా ఈ ఏడాది రెండు సినిమాలు విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా నారప్ప ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. తదుపరి సినిమా మాత్రం తప్పకుండా థియేటర్లో విడుదల చేయాలని అనుకున్నారు.

మలయాళం హిట్ సినిమాకు రీమేక్ గా వచ్చినటువంటి దృశ్యం 2 సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇదివరకే పలుమార్లు క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ సినిమా కూడా ఇప్పుడు ఓటీటీ వైపు వెళ్లే అవకాశం ఉన్నట్లు ఫిల్మ్ నగర్లో టాక్ వస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ల రేట్ల విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. నిర్మాత సురేష్ బాబు డిస్ని ప్లస్ హాట్ స్టార్ ఇచ్చిన ఒక ఆఫర్ ను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్లు తెలుస్తోంది. కుదిరితే థియేటర్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. లేకపోతే మళ్లీ వెంకీ మూవీ ఓటీటీ లో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Post a Comment

Previous Post Next Post