ఎవరు మీలో కోటీశ్వరులు.. మహేష్ ఎంత గెలిచాడంటే? - TollywoodBoxoffice.in

Exclusive Portal for Boxoffice Collections

ఎవరు మీలో కోటీశ్వరులు.. మహేష్ ఎంత గెలిచాడంటే?


జూనియర్ ఎన్టీఆర్ సరికొత్తగా మొదలుపెట్టిన ఎవరు మీలో కోటీశ్వరులు షో విజయవంతంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ అంటే దాదాపు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరూ కూడా ఇష్టపడతారు. అందుకే ఎన్టీఆర్ పిలిచిన వెబ్టనే అగ్ర హీరోలతో పాటు దర్శకులు కూడా మొదటిసారి షోలో పార్టీసిపెంట్ చేసేందుకు వస్తున్నారు.

ఇక ఇటీవల మహేష్ బాబు కూడా ఎవరు మీలో కోటీశ్వరులు లో సరదాగా గేమ్ ఆడినట్లు సమాచారం. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో లీకయ్యాయి. అయితే ఈ ఆటలో మహేష్ బాబు తన ఎంత గెలుచుకున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. మహేష్ బాబు మొత్తం 25 లక్షల వరకు గెలుచుకున్నట్లు తెలుస్తోంది. ఇక భవిష్యత్తులో మరి కొంత మంది స్టార్ హీరోలు కూడా ఎవరు మీలో కోటీశ్వరులు షోలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.