Sai Dharam Tej Health Update!


మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఇటీవల హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో గత కొన్ని రోజుకుగా చికిత్స పొందుతున్న మెగా మేనల్లుడి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడినట్లు తెలుస్తోంది. ఇటీవల అతన్ని ఐసీయూ నుంచి నార్మల్ గదికి షిఫ్ట్ చేసినట్లు సమాచారం. 

ఇక సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం పూర్తి స్పృహలోనే  ఉన్నారని, వెంటిలేటర్‌ తొలగించినట్లు డాక్టర్స్ టీమ్ వెల్లడించింది.  శ్వాస కూడా మొత్తం నార్మల్ గానే ఉందని ఎప్పటిలానే మాట్లాడగలుగుతున్నారని కూడా అన్నారు. ఇక మరో మూడు రోజుల్లో  ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు కూడా వివరణ ఇచ్చారు. ఇక రేపు సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చేతుల మీదుగా విడుదల చేయబోతున్నారు.


Post a Comment

Previous Post Next Post