హిట్టు కొట్టగానే మళ్ళీ మెగా కాంపౌండ్??


మాస్ కమర్షియల్ దర్శకుడు సంపత్ నంది చాలా కాలం తర్వాత సీటీమార్ సినిమా మొత్తానికి ఒక సక్సెస్ అయితే అందుకున్నాడు. మొదటి రెండు రోజుల్లోనే ఈ సినిమా పాజిటివ్ టాక్ రావడంతో దర్శకుడికి అలాగే హీరో గోపీచంద్ కూడా మళ్లీ ట్రాక్ లొకి వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే ఇదే స్పీడ్లో వీలైనంత త్వరగా మరో సినిమాను సెట్స్ పైకి తేవాలని దర్శకుడు ఆలోచిస్తున్నాడు.

హిట్ పడగానే మొదటగా అతని ఫోకస్ మెగా కాంపౌండ్ మీద పడినట్లు తెలుస్తోంది. ఇదివరకే సంపత్ నంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రచ్చ అనే కమర్షియల్ సినిమా చేశాడు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చేసే అవకాశం వచ్చింది కానీ ఎందుకో చివరి నిమిషంలో ప్రాజెక్టు  మిస్సయింది. ఇక సంపత్ మెగాస్టార్ కు టచ్ లోనే ఉంటున్నాడు. ఇక చిన్న దర్శకులులకు కూడా అవకాశం ఇవ్వడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్న చిరంజీవి సంపత్ నంది లాంటి మాస్ కమర్షియల్ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగానే ఉన్నారట. ఇటీవల సిటీ మార్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇక సంపత్ నంది ఆ చనువుతోనే మరొక కథను రెడీ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post