టాలీవుడ్ బెస్ట్ కపుల్ లలో ఒకరైన నాగా చైతన్య - సమంత మధ్యలో దూరం పెరిగినట్లు ఇటీవల అనేక రకాల కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ డోస్ ఎంత పెరుగుతున్నా కూడా ఇంతవరకు ఎవరి నుంచి అసలైన క్లారిటీ రాలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటిలానే ఈ స్టార్ కాపుల్స్ కొనసాగుతున్నారు.
లవ్ స్టొరీ ట్రైలర్ పై సమంత కాస్త లేటుగా స్పందించిన విషయం తెలిసిందే. ఇక వరుసగా ఇంటర్వ్యూలను పాల్గొనబోతున్న నాగచైతన్య ముందుగానే తన ప్రెస్ మీట్ కు సంబంధించిన విషయాలపై హింట్ ఇవ్వబోతున్నాడట. కొంతమంది జర్నలిస్టులను మాత్రమే సెలెక్ట్ చేసుకొని సినిమాకు సంబంధించిన విషయాలపై మాత్రమే ప్రశ్నలు వేయాలని చెబుతారట. పర్సనల్ విషయాలు అవసరమని కూడా ఇదివరకే కొందరికి ఇంటిమేట్ చేసినట్లు సమాచారం. మరి ఈ విషయంలో అసలు క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment