టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి విడుదల తేదీల పై కన్ఫ్యూజన్ నెలకొంది. సంక్రాంతి కానుకగా రాబోయే సినిమాల్లో అనుకున్న తేదీకి వస్తాయా రావా అనే సందేహం మొదలయ్యింది. మొన్నటివరకు అయితే ముగ్గురు హీరోల విషయంలో అయితే ఎలాంటి అనుమానాలు రాలేదు. కానీ ఎప్పుడైతే RRR సంక్రాంతి పై ఫోకస్ పెట్టిందో అప్పటి నుంచి మిగతా సినిమాలు వస్తాయా వాయిదా వేసుకుంటాయా అనే టాక్ మొదలైంది.
ఇక పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ జనవరి 12న తప్పకుండా వస్తుందని ఇప్పటికే చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ రాదేశ్యామ్ కూడా అనుకున్న సమయానికి జనవరి 14న రానున్నట్లు తేల్చి చెప్పేశారు అయితే ప్రస్తుతం జనవరి 13న రాబోయే సర్కారు వారి పాట విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం చిత్ర నిర్మాతలు మహేష్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం సర్కారు వారి పాట షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ వస్తోంది. కానీ అఫీషియల్ గా క్లారిటీ వచ్చే వరకు కూడా నమ్మలేము. ఇక RRR అన్ని వైపులా ఆలోచించి పొంగల్ బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందట. మరి ఈ పోటీ విషయంలో మహేష్ బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి
Follow @TBO_Updates
Post a Comment