సంబంధమే లేదన్నారు...మళ్ళీ ఎందుకు కలిసినట్లు?


ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ మరియు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మధ్య వాడివేడిగా ఇటీవల ఆరోపణలు వెలువడిన విషయం తెలిసిందే. ఇక  కొంతమంది ప్రముఖ నిర్మాతలు ఏపీ మంత్రి పెర్ని నానిని కలవడం చర్చనీయాంశంగా మారింది. అగ్ర నిర్మాత దిల్ రాజు గత రెండు రోజులుగా అటు వైపు యూ టర్న్ తీసుకున్న విషయం తెలిసిందే.  కొన్ని రోజుల క్రితం మచిలీపట్నంలో పెర్ని నానిని కలిసిన నిర్మాతలందరూ ఈరోజు పవన్ కళ్యాణ్‌ని హైదరాబాద్ నివాసంలో కలివడం మరింత హాట్ టాపిక్ గా మారింది.

దిల్ రాజు, డివివి దానయ్య, మైత్రి నవీన్, యువి వంశీ, బన్నీ వాసు మరియు సునీల్ నారంగ్ పవన్ కళ్యాణ్‌ని కలిశారు.  నిర్మాతలతో పాటు దిల్ రాజు పవన్ కళ్యాణ్ కు తమ ప్రణాళికల గురించి మరియు జరుగుతున్న చర్చల గురించి తెలియజేశారు.  ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల గురించి ప్రధాన పరిణామాల గురించి కూడా వారు ఆయనకు వివరించారట. అంతా బాగానే ఉంది కాని పవన్ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసినప్పుడు అందుకు కౌంటర్ గా ఏపీ అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పినట్లు నిర్మాతలు ప్రకటనను కూడా వదిలారు. ఇక ఇప్పుడు పవన్ వద్దకు రావడం కూడా ఆయనను శాంతిప జేసేందుకే అని తెలుస్తోంది.


Post a Comment

Previous Post Next Post