విక్రమార్కుడు 2: రవితేజ కాకపోతే.. ఇంకెవరు?


విక్రమార్కుడు సినిమా అప్పట్లో రాజమౌళి మరియు రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్.  ఈ చిత్రం అనేక భాషల్లో రీమేక్ చేయబడింది. ఇక చాలా సంవత్సరాల తరువాత. రచయిత  విజయేంద్ర ప్రసాద్ సీక్వెల్ కోసం స్క్రిప్ట్ రాశారు.  ఎస్ఎస్ రాజమౌళికి విక్రమార్కుడు 2 కోసం టైమ్ లేదు కాబట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సంపత్ నందిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రవితేజతో చర్చలు కూడా జరిపారు. 

అయితే మాస్ రాజా ఇటీవలి వరుస ప్రాజెక్టులపై సంతకం చేశాడు. దీంతో ఆ సీక్వెల్ లో నటించకపోవచ్చని సమాచారం.
ఇక సంపత్ నంది మరో హీరో కోసం వేట మొదలు పెట్టాడు. ప్రాజెక్ట్ త్వరలో ప్రకటించబడుతుంది. ఇక ఆ కథకు విక్రమార్కుడు 2 టైటిల్‌తోనే తెరపైకి తెస్తారా లేదా సినిమా టైటిల్‌ని మారుస్తాడా అనేది తెలియాల్సి ఉంది.  విక్రమార్కుడుని దృష్టిలో ఉంచుకునే విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ రాశారు. ఇక తారాగణం, సిబ్బంది మరియు నిర్మాణ సంస్థ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే అఫీషియల్ గా తెలుపనున్నారు.

Post a Comment

Previous Post Next Post