ఓటుకు రూ.75వేలు.. మహేష్ బాబుకి గూగుల్ పే చేశాం: మంచు విష్ణు


టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఎన్నికల వాతావరణం రాష్ట్ర స్థాయి ఎన్నికల హడావిడిని తలపిస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఓ వైపు ప్రకాష్ రాజ్ మరోవైపు మంచు విష్ణు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఇక ఇటీవల నాగబాబు ఓట్ల కోసం డబ్బులను ఇచ్చి ప్రలోబపరుస్తున్నారు అంటూ ఒక్కో ఓటుకు పది వేల ఇస్తున్నట్లు టాక్ వచ్చిందని ఆరోపణలు చేశారు.

ఇక ఆ విషయంపై విష్ణు తనదైన శైలీలో సెటైర్లు వేశారు. 'మా' ఎన్నికల్లో ఒక్కొక్కరికి రూ. 75 వేలు ఇస్తున్నాం.. రూ.10 వేలు అని నాగబాబు అంటున్నారు.. అది తప్పు.. మహేష్‌బాబుకు కూడా గూగుల్ పే చేసాం.. అంటూ మంచు విష్ణు వెటకారంగా కౌంటర్ ఇచ్చాడు. ఇక కాస్త సీరియస్ గా ప్రధాని మోడీతో నాకు చనువు ఉందని అంటూ మా అసోసియేషన్‌లోని బై లాస్ అడ్వాంటేజ్‌గా తీసుకుని కొందరు బయటి వాళ్లు వస్తున్నారని వాటిని మారుస్తాం అని కూడా రవి బాబు మాట్లాడినట్లు.. తెలుగు వాన్నే ఎన్నుకోవాలి అని మంచు విష్ణు వివరణ ఇచ్చారు.


Post a Comment

Previous Post Next Post