అఖిల్ అక్కినేని హార్డ్-కోర్ స్పోర్ట్స్ లవర్ అని అందరికి తెలిసిందే. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సమయంలో కూడా ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని ఆడాడు. అతనికి మొదటి నుంచి కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇక ఇటీవల ఒక స్టార్ క్రికెటర్ బయోపిక్ చేయాలని ఉన్నట్లు వివరణ ఇచ్చాడు. నేను స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సరైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ అలాంటి కథ చేస్తే తప్పకుండా అందరికి నచ్చే విధంగా చేస్తానని అన్నాడు.
అఖిల్ ఎట్టకేలకు తాను భాగం కావాలనుకునే ఒక డ్రీమ్ సబ్జెక్ట్ గురించి చెప్పాడు. అదే విరాట్ కోహ్లీ బయోపిక్. విరాట్ కోహ్లీ జీవితం అభిరుచి, ఫైర్ మరియు అంకితభావంతో నిండి ఉంది. అతను నన్ను చాలా విధాలుగా ప్రభావితం చేశాడు. ఏదో ఒకరోజు అతనిపై సినిమా చేస్తే చాలా బాగుంటుంది అని అఖిల్ వివరణ ఇచ్చారు. మొత్తానికి క్రికెటర్‌గా తెరపై నటించాలనే తన కోరికను వెల్లడించాడు. ఇక ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లో ఈ నెల 15 ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @TBO_Updates
Post a Comment