రకుల్ పెళ్లి ఆలోచనలు.. అందుకే బ్రేక్?


తన పుట్టినరోజు సందర్భంగా, రకుల్ ప్రీత్ సింగ్ నిర్మాతగా మారిన నటుడు జాకీ భగ్నానితో డేటింగ్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ తో ప్రస్తుతం బిజీగా మారింది. ఇటీవల పెళ్లి ఎనౌన్స్మెంట్ తో  రకుల్ కు మరియు జాకీకి పలువురు బాలీవుడ్ మరియు టాలీవుడ్ ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వచ్చాయి.

ఇక రకుల్ మరియు జాకీ వచ్చే ఏడాది వివాహం చేసుకోబోతున్నారని తాజా వార్తలు చెబుతున్నాయి.  పెళ్లి తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఇక రకుల్ వివాహ సమయంలో పని నుండి కాస్త బ్రేక్ తీసుకుంటుందట. రకుల్ ప్రీత్ ప్రస్తుతం అర డజను బాలీవుడ్ చిత్రాలతో చాలా బిజీగా వుంది. ఆమె తమిళ్ ఇండస్ట్రీలో కూడా ఫినిష్ చేయాల్సిన సినిమాలు ఉన్నాయి. ఇక తెలుగులో అయితే ఇటీవల కొండపొలం సినిమాతో వచ్చింది.


Post a Comment

Previous Post Next Post