బిగ్ బాస్ సీజన్ 5 మొదలైనప్పుడు కంటెస్టెంట్స్ విషయంలో నిర్వాహకులు అనుకున్నంతగా ఏమి ఆకట్టుకోలేదు అనే కామెంట్స్ చాలానే వచ్చాయి. ఇక అప్పుడప్పుడు తప్పితే షో అంత ఇంట్రెస్టింగ్ గా ఏమి కొనసాగడం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. ఇక మొదటి మూడు వారాల్లో సరయు, ఉమాదేవి, లహారి ఎలిమినెట్ అయిన విషయం తెలిసిందే.
ఇప్పటివరకు ముగ్గురు అమ్మాయిలే వెళ్లిపోవడంపై కూడా విమర్శలు చాలనే వచ్చాయి. ఇక నాలుగవ వారం మాత్రం మొదటిసారి మెన్ వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు. కంటెస్టెంట్స్ కు జంతువుల పేర్లు పెట్టి కాస్త హైలెట్ అవ్వాలని అనుకున్న నటరాజ్ మాస్టర్. ఆయన వెళ్లిపోవడం కాయమని టాక్ అయితే గట్టిగానే వస్తోంది. ఇక నాగార్జున గారు ఈవారం తన హోస్టింగ్ తో మెప్పిస్తారో లేదో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment