దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ RRRపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే చాలా కాలంగా వాయిదా పడుతున్న ఈ సినిమాని ఎలాగైనా 2022 సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారు. అయితే కొన్ని నెలల క్రితమే ఆ ఫెస్టివల్ ను ముగ్గురు అగ్ర హీరోలు సెట్ చేసుకున్నారు.
ఇక ప్రస్తుతం ఆ హీరోల నిర్మతలు రాజమౌళి నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రాజమౌళి RRR సినిమకు పండగ సీజన్ తో అంత అవసరం ఏమిటి? ఆ సినిమా ఎప్పుడు వచ్చినా భారీ స్థాయిలో కలెక్షన్స్ వస్తాయి అని ఓ అగ్ర నిర్మాత కామెంట్ కూడా చేసినట్లు టాక్ వస్తోంది. ఈ విషయంలో రాజమౌళి అయితే వెనక్కి తగ్గేలా లేడని రెండు సినిమాల నిర్మాతలు వారి విడుదల తేదీలను మార్చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Follow @TBO_Updates
Post a Comment