టాలీవుడ్ ఇండస్ట్రీలో మా ఎన్నికల పర్వం రోజుకో కొత్త టాపిక్ తో హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి కోసం పోటాపోటీగా ప్రెస్ మీట్స్ నిర్వహించి ప్రచారాలు గట్టిగానే చేస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇవ్వడంపై మంచు మోహన్ బాబు విబిన్నంగా స్పందించారు.
మోహన్ బాబు మాట్లాడుతూ.. ఏకగ్రీవకంగా అయ్యేందుకు చర్చలు జరిపినా సఫలం కాలేదు. చిరంజీవి నాకు మంచి మిత్రుడే కానీ ఆయన ప్రకాష్ రాజ్ కు ఎందుకు మద్దతు ఇస్తున్నారో నాకు తెలియదు. ప్రకాష్ రాజ్ తో నాకు శత్రుత్వం అయితే లేదు. మంచు విష్ణుకి మద్దతుగా వెనకాల చాలా మంది ఉన్నారు. అయితే చిరంజీవి ఒకవేళ తన పిల్లలను ఎవరినైనా మా ఎన్నికల పోటీలో ఉంచితే తప్పకుండా నేను మద్దతు ఇచ్చే వాడిని. నాగబాబు, అల్లు అరవింద్, నాగార్జున పిల్లలు కూడా నాకు బిడ్డలతో సమానమే. అయితే ప్రకాష్ రాజ్ కు వారందరు మద్దతు ఇచ్చినప్పటికీ నేను అంగీకరించను.. అది అంతే.. అంటూ మోహన్ బాబు బలంగా తెలియజేశారు.
Follow @TBO_Updates
Post a Comment