Prabhas25 Latest Update!


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ షూటింగ్ అయితే పూర్తయింది. ఇక  సాలార్, ఆదిపురుష్ కోసం షూటింగ్ పనులను కూడా వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని చేస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్టుల చిత్రీకరణ పూర్తయిన వెంటనే, ప్రభాస్ ప్రాజెక్ట్ K రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారు. ప్రభాస్ తన భవిష్యత్ ప్రాజెక్ట్‌ల గురించి కూడా చర్చించడంలో బిజీగా ఉన్నాడు. ముఖ్యంగా 25 వ చిత్రం అక్టోబర్ 7 న అధికారికంగా ప్రకటించబడుతుందని సమాచారం.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ ప్రతిష్టాత్మక పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించనున్నట్లు ప్రస్తుతం ఒక టాక్ వస్తోంది. అలాగే రాజమౌళి కూడా వినిపిస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో ఆ సినిమా తెరపైకి రానున్నట్లు కథనాలు కూడా వెలువడుతున్నాయి. ప్రభాస్ ఆదిపురుషుని నిర్మిస్తున్న టాప్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ టి సిరీస్ యువి క్రియేషన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందట.  అలాగే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే యాక్షన్ ఎంటర్టైనర్ ను సిద్ధార్థ్ ఆనంద్‌తో ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో కూడా ఒక అగ్రిమెంట్ ఉన్నట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post