మోసపోయిన మహేష్ బాబు సిస్టర్.. 100కోట్ల స్కామ్?


శిల్పా చౌదరిపై పలు ఫిర్యాదులు రావడంతో నార్సింగి పోలీసులు షాక్‌కు గురయ్యారు. శిల్పా చౌదరి హైదరాబాద్  చుట్టుపక్కల పలువురు వ్యాపారవేత్తలను అలాగే ప్రముఖ  మహిళల నుండి కోట్లాది డబ్బు వసూలు చేసి మోసం చేసినట్లు తెలుస్తోంది.  తనను తాను చిత్ర నిర్మాతగా పేర్కొంటూ, శిల్పా చౌదరి ప్రముఖులతో పరిచయం పెంచుకుంది. ఇక ఆమె వీకెండ్స్ లో పార్టీలను ఏర్పాటు చేస్తూ 100కోట్లకు పైగా టోకరా వేసినట్లు సమాచారం. 

శిల్పా చౌదరి అరెస్ట్ కావడంతో మోసపోయిన పలువురు నార్సింగి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. మహేష్‌బాబు సోదరి ప్రియదర్శిని కూడా నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో 2 కోట్ల రూపాయలు మోసం చేశారని ఫిర్యాదు చేశారు. ఇక కేసు దర్యాప్తులో ఉంది.  శిల్పా చౌదరి భర్త శ్రీ కృష్ణ ప్రసాద్ తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వ్యాపారవేత్తగా చెప్పుకున్నాడు.  శిల్పా చౌదరి మరియు ఆమె భర్త ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Post a Comment

Previous Post Next Post