Type Here to Get Search Results !

Akhana Movie @ Review


కథ:
మురళీకృష్ణ (బాలకృష్ణ) అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్‌ ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేసే ఒక మంచి వ్యక్తి. మరోవైపు వరదరాజులు (శ్రీకాంత్)కి చెందిన ఒక మైనింగ్ మాఫియా పెద్దఎత్తున సమస్యలను సృష్టిస్తాయి. ఇక యురేనియం తవ్వకలతో చాలామంది చిన్నారుల ప్రాణాలకు ముప్పుగా మారడంతో  మురళీ కృష్ణ వరదరాజులుని ఎదుర్కోవడానికి సిద్ధమవుతాడు. కానీ అప్పుడే అతను అరెస్ట్ అవుతాడు. ఇక మురళీ కృష్ణ కుటుంబంతో గూండాలు మరింత విధ్వంసం సృష్టించినప్పుడు, అందరినీ రక్షించడానికి అఖండ (బాలకృష్ణ అఘోరా) సన్నివేశంలోకి ప్రవేశిస్తాడు.  ఈ అఖండ ఎవరు?  అతని నేపథ్యం ఏమిటి?  మరియు అతను అందరినీ ఎలా కాపాడతాడు అనేది అఖండ కథ.

విశ్లేషణ:
బాలయ్యను పవర్‌ఫుల్ అవతారంలో చూసిన అభిమానులు చాలా రోజులైంది. ఇక అఖండ ద్వారా బోయపాటి శ్రీను బాలయ్యను మునుపెన్నడూ చూపించని విధంగా ద్విపాత్రాభినయంలో ప్రజెంట్ చేసి వారికి ఫుల్‌మీల్‌ను అందించారు. ఇక బాలయ్య రెండు పాత్రలకు పూర్తి న్యాయం చేసాడు. కానీ అభిమానులు రెక్కువగా ఇష్టపడేది మాత్రం అఖండ పాత్రనే. అఘోరాగా బాలయ్య మరో లెవెల్‌లో ఉన్నాడు. స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, ఇంటెన్స్ లుక్ సాలిడ్ గా వర్కౌట్ అయ్యింది. ఈ సినిమాకి ఉన్న అతి పెద్ద మేజర్ పాయింట్ థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. థమన్ లేకపోతే ఈ సినిమా ఈ స్థాయిలో వచ్చేది కాదేమో.  అన్ని ఎలివేషన్ ఎపిసోడ్‌లకు థమన్ అందించిన BGM అద్భుతంగా ఉంది.  ప్రగ్యా జైస్వాల్‌కి మంచి పాత్ర రాగా దాన్ని పూర్తిగా ఉపయోగించుకుంది. 

కాలకేయ ప్రభాకర్ క్రూరమైన పోలీసుగా కూడా చక్కగా నటించాడు. చివరగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, శ్రీకాంత్ నెగటివ్ రోల్‌లో షాక్ ఇచ్చాడు.  అతను తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. ఇక బాలయ్యకు మంచి ఫైట్ ఇచ్చాడు.  కానీ అతని స్క్రీన్ టైమ్ చాలా లిమిట్ లోనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొదట్లో అంతగా ఆకట్టుకోకపోవచ్చు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ లో మాత్రం అఘోరా ఎంట్రీ అదిరిపోయింది. ఇక ఎప్పటిలానే బోయపాటి  అఖండలో కూడా పెద్దగా కథను హైలెట్ చేయలేదు. కమర్షియల్ ఫార్మాట్ లో ఉంది. కథలో పెద్దగా ఆసక్తికరమైన కొత్త అంశాలు ఏమి ఉండవు. 

అఖండ సెకండ్ హాఫ్ లో కొన్ని రొటీన్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి.  ఒక్కసారి అఖండ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తే అతడికి పెద్దగా వ్యతిరేకత ఉండదు.  బాలయ్య కేవలం గూండాలను చంపుతూనే ఉంటాడు.  కొత్తదనం మిస్ అయింది.  
 సెకండాఫ్‌లో ఫ్యామిలీ, మదర్ యాంగిల్ చూసేవాళ్లకు కాస్త బలవంతంగా ఎక్కించినట్లు అనిపిస్తుంది. ఎమోషనల్ యాంగిల్ కూడా కాస్త మిస్ అయింది. మితిమీరిన చాలా ఫైట్‌లు కూడా ఒక సమస్య. మొత్తంగా సినిమా మాస్ ఆడియెన్స్ కు బాలయ్య అభిమానులకు యాక్షన్ ఎలివేషన్ పరంగా బాగా నచ్చుతుంది. 
 

ప్లస్ పాయింట్స్:
👉బాలకృష్ణ
👉ఇంటర్వెల్ ఎపిసోడ్
👉అఖండ పాత్ర
👉యాక్షన్ ఎపిసోడ్స్
👉థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్
👉చాలా సీన్స్ ఉహించినట్లే ఉంటాయి
👉రొటీన్ స్టోరీ కాన్సెప్ట్

ఫైనల్ గా..
బాలయ్య అభిమానులకు అఖండ జాతర

రేటింగ్: 3/5

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies