ఒక బడా ఓటీటీ ప్లాట్‌ఫారమ్ విక్కీ కౌషల్ కత్రినా కైఫ్ కు 100 కోట్ల డీల్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా ఈ జంట ఆ విషయంలో ఎలాంటి కాల్ తీసుకోలేదట. సెలబ్రిటీలు డబ్బు కోసం వారి వీడియోలను ఫొటోలను మార్కెట్ లో పెట్టడం సర్వ సాధారణమైన విషయమే. దేశంలో OTT ప్లాట్‌ఫారమ్‌ల ట్రెండ్ పెరగడంతో, ఆ ప్లాట్‌ఫారమ్‌లో ఈ జంట పెళ్లిని చూడటం ఆసక్తికరంగా ఉంటుందని క్యాష్ చేసుకుంటున్నారు.
ఓటీటీ ప్లాట్‌ఫారమ్ కంపెనీలు సెలబ్రిటీ జంటను సంప్రదించడం ఇదే తొలిసారి. జంట ఆఫర్‌ను అంగీకరిస్తే, OTT ప్లాట్‌ఫారమ్ వివాహ ఈవెంట్‌ను ఫీచర్ ఫిల్మ్‌గా ప్రత్యక్ష ప్రసారం చేస్తుందట. మరియు స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు ఇతర అతిథుల ప్రత్యేక ఇంటర్వ్యూలను కూడా కలిగి ఉంటుందట. అందుకోసం 100కోట్ల డీల్ సెట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. నమ్మడానికి ఇది కాస్త అనుమానంగానే ఉన్నా కూడా బాలీవుడ్ బడా మీడియా ఛానెల్స్ లో కూడా ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఈ జంట డిసెంబర్ 9న సవాయి మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో వివాహం చేసుకోనున్నారు.
Follow @TBO_Updates
Post a Comment