మెగాస్టార్ లిస్టులో అఖండ డైరెక్టర్?


చాలా కాలం క్రితం, మెగాస్టార్ చిరంజీవి తన రాబోయే ప్రాజెక్ట్‌లలో ఒకదానికి బోయపాటి శ్రీనుతో కలిసి పని చేస్తారని వార్తలు వచ్చాయి.  కానీ ఈ ప్రాజెక్ట్ తెలియని కారణాల వల్ల ఆగిపోయినట్లు కథనాలు వెలువడ్డాయి. ఇక ఇప్పుడు చిరంజీవి బోయపాటితో కలిసి ఓ మాస్ ఎంటర్‌టైనర్ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు టాక్ వస్తోంది. 

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి బోయపాటికి తెలియజేసి తగిన స్క్రిప్ట్‌తో రమ్మని కోరినట్లు తెలుస్తోంది. బోయపాటి ఇప్పుడు అఖండ విజయంతో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పటికే చిరు తనయుడితో వినయ విధేయ రామ అనే సినిమా చేసిన బోయపాటి త్వరలో తన తదుపరి స్క్రిప్ట్‌ ను చిరంజీవికి చెప్పాలని భావిస్తున్నారు.  చిరంజీవికి స్క్రిప్ట్ నచ్చితే, ఈ ప్రాజెక్ట్ చాలా వేగంగా కార్యరూపం దాల్చవచ్చు. ప్రస్తుతం మెగాస్టార్ బోళా శంకర్, చిరు 154 సినిమాలతో బిజీగా ఉన్నాడు.


Post a Comment

Previous Post Next Post