ఆ హీరో వల్లే 156 సెట్టయ్యింది!


నేటితరం యువ దర్శకులు అగ్ర హీరోలతో చాలా తొందరగా సినిమా చేసే అవకాశాలు అందుకుంటున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా భీష్మ దర్శకుడు వెంకీ కుడుముల మెగాస్టార్ తో లక్కీ ఛాన్స్ అందుకోవడం విశేషం.

అయితే మెగాస్టార్ చిరంజీవి 156వ ప్రాజెక్ట్ సెట్టవ్వడానికి కారణం మరొక హీరో అని తెలుస్తోంది. దర్శకుడు వెంకీ మెగాస్టార్ ఫ్యాన్ అని అందరికి తెలిసిందే. ఇక మెగాస్టార్ కు కథ చెప్పడాని కంటే ముందుగానే ఈ దర్శకుడు రామ్ చరణ్ కు స్టోరీ వినిపించాడట. వెంకీ చెప్పిన కథ బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం రామ్ చరణ్ పాన్ ఇండియా రేంజ్ లో ముందుకు సాగుతూ ఉండడం వలన ఆ రేంజ్ లో స్టోరీ సెట్టవ్వదని మెగాస్టార్ కి ఆ ప్రాజెక్ట్ ను షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరి మెగాస్టార్ తో ఈ యువ దర్శకుడు ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.


Post a Comment

Previous Post Next Post