టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఏపీ టిక్కెట్ల రేట్ల విషయంలో అనేక రకాల కన్ఫ్యూజన్స్ నెలకొన్నాయి. మొత్తానికి ఏపీ తీసుకున్న ఆర్డినెన్స్ కు హై కోర్టు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కొత్త సినిమాలకు టికెట్ల రేట్లను పెంచుకునే హక్కు థియేటర్స్ యాజమాన్యంకు ఉంటుందని తేల్చి చెప్పేసింది.
అయితే విషయం కోర్టు వరకు వెళ్ళడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం కరోనా పరిస్థితులలో జనాల భద్రత దృష్ట్యా ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు. ఆ రూట్లో వస్తే టాలీవుడ్ కు మరో దెబ్బ పడే అవకాశం ఉంది. ఇప్పటికే 20% కి పైగా నష్టాలు చవి చూస్తున్న టాలీవుడ్ జగన్ హై కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మళ్ళీ సుప్రీం కోర్టుకు వెళితే మరో ఝలక్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ విషయంలో టాలీవుడ్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment