రాధేశ్యామ్ అలస్యం అవుతుందని 4 ఏళ్ళ ముందే చెప్పాడు


టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో రాధేశ్యామ్ టాప్ లిస్టులో ఉంది. బాహుబలి సాహో వంటి పాన్ ఇండియా సినిమాల అనంతరం ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు అయితే మామూలుగా లేవు. అయితే సినిమా ఆలస్యం అవుతుందని నాలుగేళ్ళ క్రితమే ఒక వ్యక్తి చెప్పినట్లు రాధాకృష్ణ తెలియజేశారు.

తమిళనాడు మహారాష్ట్రలో చాలామంది జ్యోతిష్యులను కలిసినప్పుడు అందులో ఒక జ్యోతిష్యుడు 2022లోనే రిలీజ్ అవుతుందని 4 ఏళ్ళ క్రితమే చెప్పాడు. అతను కోవిడ్ పరిస్థితుల గురించి కూడా ముందే ఆలోచించాడో తెలియదు. ఇక అది నమ్ముతానో లేదో అనేది కూడా నాకు అర్థం కాలేదు. ఏదేమైనా కూడా సినిమా అనేది ఒక డెస్టినిలాగా కొనసాగింది అని రాధాకృష్ణ వివరణ ఇచ్చారు. ఇక సినిమాలో ఒక లవర్ బాయ్ గా ప్రభాస్ అందరికి నచ్చుతాడు అని వివరణ ఇచ్చారు.


Post a Comment

Previous Post Next Post