ఆంద్రప్రదేశ్ లోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ కలిగిన థియేటర్ ను మూసేశారు. నెల్లూరులో బాహుబలి థియేటర్ గా గుర్తింపు అందుకున్న V EPIQ మల్టీప్లెక్స్ ను ఈ రోజు నుంచి ముసివేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. 2019 లో యూవీ క్రియేషన్స్ లో పాట్నర్ గా ఉన్నటువంటి వంశీ కృష్ణ అలాగే ప్రభాస్ సంయుక్తంగా ఈ థియేటర్ ను నిర్మించారు.
ఇండియా మొత్తంలో అతిపెద్ద స్క్రీన్ గా గుర్తింపు అందుకున్న వి ఎపిక్ థియేటర్ ను మూసేశారు. ఎందుకంటే ఇటీవల ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త సినిమా టికెట్ రేట్లతో థియేటర్ ను కొనసాగించలేమని మూసేశారు. మల్టీప్లెక్స్ థియేటర్ కు 30 రూపాయల టికెట్ కు అమ్మితే కనీసం మెయింటైన్ కూడా చేయలేము అని ఏపీ లో చాలా థియేటర్స్ మూసేస్తున్నారు. ఇక అందులో భాగంగా బాహుబలి థియేటర్ గా పిలవబడే వి ఎపిక్ మూసివేయడంతో నెల్లూరు వసూలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Follow @TBO_Updates
Post a Comment