బిగ్ బాస్ 5 ఫినాలే.. గెస్ట్ గా స్టార్ హీరో?


ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో కూడా విజయవంతంగా 5వ సీజన్ ను పూర్తి చేసుకుంటోంది. అయితే ఈసారి ఫైనల్ ఎపిసోడ్ ను ఎలా కొనసాగిస్తారు అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక ప్రత్యేక అతిథిగా రాబోయే స్టార్ హీరో ఎవరు అనే విషయంలో కూడా అనేక రకాల రూమర్స్ వెలువడుతున్నాయి.

ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్ కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు టాక్ వస్తోంది. అందుకు సంబంధించిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే డిసెంబర్ 19న జరగబోయే ఫైనల్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఇక ఫైనల్స్ లో శ్రీరామ్, సన్నీ, షన్ను బలంగా పోరాడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post