పుష్పకు అన్ని వైపులా బ్యాడ్ లక్?


పాన్ ఇండియా సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద తన మార్కెట్ స్థాయిని మరింత పెంచికోవాలని చూస్తున్న అల్లు అర్జున్ కు అన్ని వైపులా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో బైకాట్ పుష్ప నినాదాలు జోరందుకున్నాయి. అక్కడ తెలుగు వెర్షన్ ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక మరోవైపు ఆంధ్ర ఏరియాలో కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం పడనుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరింత పట్టు బిగించడంతో టికెట్ల రేట్ల కేసు విషయం వాయిదాలతో కొనసాగుతోంది. ఇక యూఏ లో స్పైడర్ మ్యాన్ దూకుడు మామూలుగా లేదు. ఈ క్రమంలో బాలీవుడ్ లో మార్కెట్ కూడా అనుకున్నంతగా బజ్ లేదు. నార్త్ లో ఇంకా పూర్తి స్థాయిలో థియేటర్స్ సెట్టవ్వలేదు. ఏదేమైనా పుష్ప సినిమా సందిగ్ధంలోనే విడుదల అవుతోంది. మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Post a Comment

Previous Post Next Post