RRR దుబాయ్ ఈవెంట్ కు అన్ని కోట్లా?


బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ RRR జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇక ఆ రోజు కోసం కేవలం సినీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా చాలా మంది సినీ ప్రముఖులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు అర్ధమవుతోంది. అయితే సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను దుబాయ్ లో గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇదివరకే నిర్మాత డివివి దానయ్య, రాజమౌళి తనయుడు కార్తికేయ ఇద్దరు కూడా ఈవెంట్ కు సంబంధించిన అన్ని కార్యక్రమాల ప్లాన్స్ ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈవెంట్ కోసం 9కోట్లకు వరకు ఖర్చు చేస్తున్నట్లు టాక్ అయితే వస్తోంది. కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు సినిమాకి చేరువవ్వాలని ఆ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


Post a Comment

Previous Post Next Post