అఖండ ఇంటర్వెల్ బ్లాక్ కోసం థమన్ ఆదనపు ఖర్చు?


అఖండ ఇంటర్వెల్ బ్లాక్ యొక్క మొట్టమొదటి కట్‌ను చూసిన తర్వాత థమన్ ఆ భాగానికి పవర్ఫుల్ సంగీతాన్ని అంధించాలని నిర్మాతల చేత కాస్త ఎక్కువగానే ఖర్చు చేయించడట. 10 నిమిషాల ఎపిసోడ్‌ కోసమే థమన్ దాదాపు 20-30 లక్షల వరకు కోట్ చేశాడని అంటున్నారు.  

థమన్ కేరళ నుండి ఒరిజినల్ చెండా వాయిద్యాలను (కేరళ తబల) మరియు దానిని వాయించే నిపుణులను తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.  అఖండ ఇంటర్వెల్ బ్లాక్ యొక్క BGM వారిచే సృష్టించబడింది. సౌండ్ మిక్సింగ్ పూర్తి చేయడానికి స్పెషలిస్ట్ సౌండ్ మిక్సింగ్ ఇంజనీర్ షాదాబ్ రయీన్‌ని ముంబై నుండి హైదరాబాద్‌కు రప్పించారట.
ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం థమన్ రూపొందించిన సంగీతం యొక్క మొదటి 3-4 వెర్షన్‌లతో అంతగా సంతృప్తి చెందలేదట. ఇక ఆ తర్వాత మరొక ఫైనల్ వెర్షన్‌ను రూపొందించగా సినిమాకు ఎంతగానో హెల్ప్ అయ్యింది.

Post a Comment

Previous Post Next Post